Sunday, May 5, 2024

KHM: ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం ఎంపిక

ఇల్లందు : ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్యను అధిష్టానం ఎంపిక చేసింది. కాంగ్రెస్ మూడో లిస్టులో కోరం పేరు ప్రకటించడంతో ఆయన అభిమానులు బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 2014లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన కోరం బీఅర్ఎస్ లో చేరారు. 2018లో బీఅర్ఎస్ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి 2023లో కాంగ్రెస్ నుండి బరిలో ఉండబోతున్నారు.

పార్టీలు వేరైనా ప్రత్యర్ధులు మాత్రం పాతవారే కావడం విశేషం. నాడు కాంగ్రెస్ నుండి గెలుపొందిన హరిప్రియ నేడు బీఅర్ఎస్ నుండి పోటీ చేస్తుండగా, బీఅర్ఎస్ నుండి పోటీచేసిన కోరం నేడు కాంగ్రెస్ నుండి పోటీలో వున్నారు. దీంతో ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement