Wednesday, May 15, 2024

TS | బిటిపియస్ వద్ద ఫ్లైయాస్ లారీ దూకుడు.. రోడ్డును అక్రమిస్తూ ఇత‌ర వాహనదారులకు ఇబ్బందులు

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బిటిపియస్ వద్ద ఫ్లైయాస్ కోసం వచ్చిన లారీలు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితిని కనీసం పట్టించుకునే నాధుడు లేరు. పినపాక-మణుగూరు నుండి వచ్చి పోయే వాహనాలకు అడ్డు వస్తూ ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు. కనీసం పక్క దారి ఇవ్వ‌డంలేదు. అంతా మా ఇష్టం.. అంటూ లారీల డ్రైవర్లు ప్రవర్తసిస్తున్నారు.

ఇదేంట‌నీ ప్ర‌శ్నిస్తే.. మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటూ… ద‌బాయిస్తున్నారు. అత్య‌వ‌స‌ర వాహ‌న‌మైన 108 స‌ర్వీస్‌కు కూడా దారి ఇవ్వటం లేదు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ట్రాఫిక్ ను నియంత్రించాలని పలు వాహన దారులు కోరుతున్నారు.

స్పెషల్ ప్రోటక్షన్ తీరు మారదా…?

ఇటీవల బిటిపియస్ లో బాధ్య‌తలు స్వీకరించిన స్పెషల్ ప్రోటక్షన్ సిబ్బంది ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ స‌మ‌స్య‌ను త‌మ‌కు సంబంధం లేదనే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇట్లా అయితే వీరిని ఎందుకు నియమించడం అని ఈ ప్రాంత ప్ర‌జ‌లు అడుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement