Monday, April 29, 2024

AP | కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన విజయవాడ సీపీ

(విజయవాడ ప్రభ న్యూస్) : ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం అమ్మవారికి చీరా, సారెను సమర్పించారు.

ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అనవాయితీ ప్రకారం రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆధునీకరించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి చీర, సారెను తీసుకుని శ్రీ కనకదుర్గ గుడికి వెళ్ళగా, ఈ.ఓ. కె.ఎస్. రామారావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ అధికారులు నగర పోలీస్ కమీషనర్ దంపతులను సాదరంగా ఆహ్వానం పలికి వేద పండితుల నడుమ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. విశాల్ గున్ని ఏ.ఐ.జి. ఎం.రవీంద్ర బాబు డి.సి.పి. అజిత వెజెండ్ల సి.ఎస్.డబ్ల్యూ డి.సి.పి. ఉదయరాణి,అడ్మిన్ డి.సి.పి. మోకా సత్తిబాబు, పశ్చిమ ఎం.ఎల్.ఏ. వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్రైమ్ ఏ.డి.సి.పి. పి.వెంకట రత్నం , ఎస్.బి. ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి , ట్రాఫిక్ ఏ.డి.సి.పి. డి.ప్రసాద్ ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement