Tuesday, May 14, 2024

Elections – జ‌గ‌న్ కోసం జ‌నంలోకి భార‌తి – పులివెందులలో జోరుగా ప్ర‌చారం

కడప – ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి పార్టీ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అదే విధంగా ప్రచారాల విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదేలా అంటున్నాయి. కూటమి – వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ – వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలచారు. దీంతో..కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. కడప లో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పులివెందులలో పార్టీ తరపున ప్రచార పగ్గాలను జగన్ భార్య భారతి చేపట్టనున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. అదే విధంగా జాజాగా పులివెందుల ప్రచారంలో ఆమె దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ పులివెందుల ప్రజలను ఆమె అప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలోకి అడుగుపెట్టిన ఆమెకి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు పలకరించడానికి వస్తున్న భారతికి సొంత కూతురిలా స్వాగతం పలుకుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

- Advertisement -

స్పంద‌న అద్బుతం..
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన భారతి. పులివెందులలోని ప్రజలంతా జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించానని తెలిపారు. పులివెందులలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. మరోసారి సీఎం జగన్ పాలనకే ఓటేయాలని ప్రజలు నిశ్చయించుకుని ఉన్నారు. జగన్ పాలనలో తమ జీవిజుల్లో ఎంతో మార్పు వచ్చిందని వారు నాకు వివరించారు. అందుకే 2024 ఎన్నికల్లో జగన్కు లక్ష మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అని భారతి వెల్లడించారు.

స‌పోర్ట్ ఎంత‌?
పులివెందులలో వైఎస్ భారతి చేస్తున్న ప్రచారం జగన్ గెలుపుకు కలిసొస్తుందా అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోనే తుస్సుమనిపించేలా ఉందని, ఇప్పుడు భారతి ఎంత ప్రచారం చేసినా దాని ప్రభావం ఆశించిన ఊహించిన స్థాయిలో ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా ప్రజలు తమ నేతను చూడాలనుకుంటారే తప్ప ప్రాక్సీని కాదని, జగన్ తరపున భారతి ప్రచారం పావలా వంతు మాత్రమే వైసీపీ విజయానికి దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు. కానీ వైసీపీ పార్టీని, జగన్ పేరును మహిళల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం భారతి ప్రచారం కీలకంగా మారుతుందని, ఆ ఉద్దేశంతోనే భారతిని బరిలోకి దించి ఉంటే వైసీపీ ప్లాన్ సక్సెస్ అయినట్లేనని వారు అంటున్నారు. కానీ భారతి ప్రచారం వైసీపీ గెలుపుకు ఎంత వరకు ఊతమిస్తుందంట మాత్రం ఫలితాలు వస్తేనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉంటుందని వారు చెప్తున్నారు.

షర్మిలకు మద్దతుగా అనిల్‌
క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్.. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైకాపాకు మద్దతుగా క్రిస్టియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయనే వైకాపాకు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైయస్ఆర్ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ.. పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement