Friday, May 3, 2024

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్‌డేట్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమాల్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘‘సలార్-సీస్ ఫైర్ పార్ట్ 1’’. ఈ సినిమాపై మొద‌టి నుంచే ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా కోసం రెండు ట్రైలర్‌లను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు మేక‌ర్స్. ఒక్క టీజర్‌తోనే కొత్త రికార్డులను సృష్టించిన సలార్‌.. రెండో ట్రైలర్‌తో ఇంకా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందో చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. కాగా, బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా టాలీవుడ్ బజ్ ప్రకారం అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ ని పురస్కరించుకుని ఆరోజున సలార్ టీమ్ ఒక సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తుందని అంటున్నారు. అయితే అది ఏమిటనేది ఆరోజునే తెలుస్తుందట. మరోవైపు అదేరోజున సలార్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. మరి మొత్తంగా ఆ స్పెషల్ రోజున సలార్ మేకర్స్ ఏలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement