Monday, April 29, 2024

జగన్నాధపురం ఉన్నత పాఠశాలను త‌నిఖీ చేసిన‌ కలెక్టర్ అనుదీప్

పాల్వంచ : పాల్వంచ మండలంలోని జడ్పీఎస్ఎస్ జగన్నాధపురం ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలల్లోకి ప్రవేశించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఆరో తరగతి, పదో తరగతి విద్యార్థులను అందరిని కూడా అర్థగంటకు పైగా వారితో వివిధ అంశాలపై చర్చించారు. విద్యార్థులు ఇంగ్లీషు భాష మీద ఉన్న పట్టును ప్రతి విద్యార్థిని చదివించి మరి తెలుసుకున్నారు. విద్యార్థులంతా కూడా ఇంగ్లీషు భాష పరిజ్ఞానంలో బాగా ముందుగా ఉండటంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. బాగా చదివిన విద్యార్థులు ఆయన ఎంతో ప్రోత్సాహం కల్పించారు. అంతా కూడా ఇంకా బాగా చదువుకొని 100% రిజల్ట్ తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా లేదని ఈరోజు పెడుతున్న కూరలు బియ్యం అన్ని కూడా చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు రావటం లేదని ఆయన దృష్టి తేగా ఈ పది రోజుల్లో మొత్తం బిల్లులు వస్తాయని డీఈవో సోమశేఖర్ శర్మ తెలిపారు. పాఠశాల ముగిసిన తర్వాత, సెలవు దినాలలో కొందరు ఆకతాయిలు పాఠశాలలోకి చేరి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. అనేకమార్లు దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఉపాధ్యాయులు తెలపగా ఆయన స్పందించి పాల్వంచ సీఐతో మాట్లాడతానని అన్నారు. వెంటనే పంచాయతీ నిధులతో నైట్ వాచ్మెన్ ను ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడే ఉన్న సర్పంచ్ అనితను ఆయన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య హాజరు శాతం బాగా పెంచాలని విద్యార్థులు అందరూ కూడా ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సోమశేఖర శర్మ, జెడ్పిటిసి బరపాటి వాసుదేవరావు, తాసిల్దారు రంగా ప్రసాద్, ఎంపీడీవో ఎం డి ఓ, సర్పంచ్ అనిత, ఉపసర్పంచ్ వీరభద్రం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement