Sunday, May 12, 2024

ఇంట్లో నిద్రిస్తున్న మ‌హిళ మెడ‌లో బంగారం చోరీకి య‌త్నం..

ఖమ్మం : ముదిగొండ ఎస్టీ కాలనీలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి దొంగ‌త‌నానికి య‌త్నించాడు. దీంతో దుండ‌గుడిని ప‌ట్టుకుని స్థానికులు దేహ‌శుద్ధి చేశారు. వివ‌రాల్లోకి వెళితే… ముదిగొండ ఎస్టీ కాలనీలో ఓ ఇంట్లోకి చొర‌బ‌డి నిద్రిస్తున్న బానోతు తులసి అనే మహిళ మెడలో ఉన్నబంగారపు పుస్తెలతాడును గుర్తు తెలియని దుండగుడు లాగేందుకు య‌త్నించాడు. వెంట‌నే ఆమె నిద్రలేవడంతో తాడును వదిలేసి పారిపోతున్న దుండగుడిని ఆ మహిళ వెంటాడి ప‌ట్టుకుంది. స్థానికులు దొంగ చేతులు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement