Wednesday, March 29, 2023

Drugs Case: అభిషేక్‌తో ఖాకీల‌ దోస్తీ.. చాటింగ్ లిస్టులో ఇద్దరు పోలీసుల వ్యవహారం

ప్రభన్యూస్‌ క్రైం, హైదరాబాద్‌: ఏదైనా సామాన్యుడికి సహాయం చేసే విషయంలో రూల్స్‌ తో పాటు, చట్టాలను ప్రస్తావించే పోలీసులు, వారు అనుకున్న వాటిలో మాత్రం అక్రమనైనా నిబంధనలకు విరుద్దంగా తలదూర్చిమరీ, వ్యవహరిస్తుంటారు. దొరికేవారు తాము దొరలేమనన్నట్లు చలామణి అవుతూ, సామాన్యుల విషయంలో మాత్రమే రూల్స్‌ వారికి పక్కాగా గుర్తస్తాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమైన బాధితులకు న్యాయపరమైన సహాయం చేసే విషయంలో మాత్రం కాస్త మానవతా దృక్పథం సహాయం చేయాలంటే, మేము ఏమి చేయలేమని చెప్తుండటం అందరికి తెలిసిందే. కానీ అసాంఘిక కార్యకలపాలు జరిగే అవకాశం ఉన్న పబ్‌ ల నుంచి మాత్రం నెలనెలా పోలీసులు డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా ర్యాడిసన్‌ బ్లూ పబ్‌ లో పట్టుబడ్డ యజమాని నుంచి నేరుగా పోలీసు అధికారులకు డబ్బులు మాముళ్ల రూపంలో ఇచ్చేవారని అతని కాల్‌ డేటా ఆధారంగా నిర్ధారణ అవడం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌ గా మారింది.

నిబంధనలను ఎవరైనా పాటిస్తారు. నిబంధనలు పాటించేవారు ఎవరూ కూడా పోలీసులను సంప్రదించే అవకాశం తక్కవు. కానీ కొన్ని పబ్‌ లు మాత్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ప్రతినెలా తమకు కొంత ఇవ్వాలని కొందరు సీఐలు చెప్పడంతో, ఏలాగు సీఐకి డబ్బులు ఇస్తున్నాం కదా అని, పబ్‌ నిర్వహకులు ఇష్టానుసారంగా ఎలంటి టైమింగ్‌ లు పాటించకుండానే నిబంధనలను తుంగలొ తొక్కుతూ రెచ్చిపోతున్నారు. ఫలితంగా ప్రత్యేక పోలీసు బృందాల తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించే పబ్‌ ల బాగోతం బయటపడుతోంది. అయితే ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించే పబ్‌ నిర్వహకుల కారణంగా, నిబంధనలను గౌరవిస్తూ, నిబంధనలకు లోబడి పనిచేసే పబ్‌లకు సైతం చెడ్డపేరు వస్తుందనే వాదన వినిపడుతుంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు అన్నింటికి ఒకేలాగా చూస్తూ, సక్రమంగా నడిచే వ్యాపారానికి ఇబ్బందులు వస్తున్నాయనే చర్చ కూడా జరుగుతుంది.

- Advertisement -
   

అభిషేక్‌ తో దోస్తి చేసిన పోలీసులెవరు?
ర్యాడిసిన్‌ బ్లూ పబ్‌ లోని పుడింగ్‌ అండ్‌ వింగ్‌ పబ్‌ నిర్వహకుడు అభిషేక్‌, కొత్తమంది పోలీసులతో నేరుగా సత్ససంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తుంది. అదే జోన్‌ కు చెందిన కొందరు పోలీసులతో సత్సబంధాలు కొనసాగిస్తూ, పబ్‌ ను నిత్యం తెల్లవారుజాము వరకు నడిపేవారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ర్యాడిసన్‌ బ్లూ పబ్‌ పరిధిలోకి వచ్చే ఓ అధికారికి నెలనెలా మాముళ్లు ఇచ్చేవారని, ఎలాగు పోలీసుల సపోర్ట్‌ ఉంది కదా, తమను ఎవరూ ఆపలేరంటూ ఏకంగా అభిషేక్‌ సిబ్బందికి చెప్పేవాడని తెలుస్తోంది. పోలీసుల పరోక్ష అండతోనే అబిషేక్‌ నిబంధనలను ఉల్లంఘించి, సమయం ముగిసినా సరే, తాను అనుకున్న టైం వరకు పబ్‌ ను నడిపేవారని గుర్తించారు. ఇందుకోసం సదురు పోలీసులు అడిగందల్లా అభిషేక్‌ ఇచ్చేవాడని తెలుస్తోంది. ఓవైపు నిబంధనలు ఉల్లంఘించే పబ్‌ ల విషయంలో ప్రభుత్వంతో పాటు, సీపీ సీరియస్‌ గా ఉన్న విషయం తెలిసిందే. అధికారులు సైతం ఎప్పటికప్పుడు పబ్‌ ల నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. అయినప్పటికీ ఇవేమి పట్టించుకోకుండా ఒకరిద్దరూ పోలీసు అధికారులు మాత్రం పబ్‌ లకు ప్రత్యేకంగా ఓ రేటును నిర్ణయించి, ప్రతినెలా ఇంత ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.

మరోవైపు ప్రత్యేక అధికారులమని చెప్పుకునే పోలీసులు కూడా పబ్‌ ల నుంచి నెలనెలా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల పేరుతో పబ్‌ నిర్వహకులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, భయపెట్టి మరీ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతిరోజు పబ్‌ సమయం ముగిసేకల్లా స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి ప్రత్యేకంగా ప్రతి క్లబ్‌ కు పోలీసు కానిస్టేబుల్‌ వెళ్లి, సమయానికి పబ్‌ మూసివేశారా లేదా అనేది ప్రత్యక్షంగా తనిఖీ చేసి, ఫోటోలతో సహా ఇన్‌ స్పెక్టర్‌ కు సమాచారం ఇస్తారు. అలాంటిది రాడిసన్‌ పబ్‌ వ్యవహారం లో పోలీసు కానిస్టేబుళ్లు నిత్యం ఎందుకు తనిఖీ చేయలేదనే చర్చ కూడా జరుగుతంది. వారు రాకుండా సైతం అభిషేక్‌ మేనేజ్‌ చేశాడా అనే కోణంలోనూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిషేక్‌ ను నాలుగు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని బంజారాహాల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కస్టడీకి అనుమతిస్తే, అభిషేక్‌ చెప్పే స్టేట్‌ మెంట్‌ ఆధారంగా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement