Saturday, April 27, 2024

కేశవపూర్‌ ప్రాజెక్టుతో.. తాగునీటి కష్టాలకు చెక్‌

  • శామీర్‌పేట పరిధిలో నీటి శుద్ధి కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జనావాసాల మనుగడకు తాగునీటి సరఫరా పెను సవాలుగా మారింది. వేగంగా అభి వృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. నానాటికి పెరుగుతున్న జనాభాతో హైదరాబాద్‌ మహానగరంలో తాగునీటి సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. అర్థ శతాబ్దం కింద నిర్మించిన జంట జలాశయాలు మారిన ప్రస్తుత కాలంలో జంట నగర ప్రజల దాహాన్ని తీర్చలేకున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలను తరలించడం ద్వారా హైదరాబాద్‌ ప్రజలకు తీగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగర ప్రజల దాహార్తిని తీర్చే ందుకు తెలంగాణ ప్రభుత్వం కేశవపూర్‌ ప్రాజెక్ట్‌కు నడుం బిగించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4500 కోట్లు. 2050 సంవత్సరం నాటికి నగరానికి నీటి సమస్య తలెత్తకూ డదని 20 టీఎంసీల సామర్థ్యంతో ముందుగా ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టాలని డిజైన్‌ చేశారు. అయితే భూ సేకరణలో చిక్కు లు రావడంతో 5.4 టీఎంసీల సామర్థ్యానికి రీడిజైన్‌ చేశారు.

  • గోదావరి-కృష్ణాల అనుసంధానానికి నాంది..

గోదావరి జలాలను కొండ పోచమ్మ సాగర్‌ నుంచి కేశవపూర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంది. కొండ పోచ మ్మ సాగర్‌ మిట్టలో ఉండటంతో 18 కి.మీ.ల మేర భూమ్యా కర్షణ శక్తి ద్వారా నీటిని దిగువనున్న కేశవపూర్‌కు తరలించ నున్నారు. దీని కోసం 3,600 ఎంఎం వ్యాసార్థం గల పైపులైన్లను 2వరుసల్లో వాడనున్నారు. దీని ద్వారా గోదా వరి-కృష్ణాల అనుసంధానానికి కూడా అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీనితో పాటు శామీర్‌పేట్‌ పరిధిలో బొమ్మరాసిపేట వద్ద 750 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఇది 172 మిలియన్‌ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసేందుకు వీలుగా ఉంటుంది. శుద్ధి చేయటానికి నీటి తరలింపు కోసం 16 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు పంపులు వాడనుండగా, శుద్ధి చేసిన నీటిని తరలించటం కోసం 2 మెగా వాట్ల సామర్థ్యం గల 8 పంపులను వాడనున్నారు.

  • 50ఎకరాల భూసేకరణ పూర్తి..

కేశవపూర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. మేడ్చల్‌ జిల్లా మూడుచింతల పల్లి మండలం కేశవపూర్‌ కొండల నడుమ ఈ ప్రాజెక్టు నిర్మా ణ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. ప్రాజెక్టును 1500 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం అటవీ భూము లతో పాటు పట్టాదారుల నుంచి అధికారులు భూమిని సేకరి స్తున్నారు. ఈ రిజర్వాయర్‌ కోసం 99 ఎకరాల పట్టా భూ ములు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికే 50 ఎకరాల వరకు సేకరించారు. అదేవిధంగా 267 ఎకరాల అసైన్డ్‌ భూములుగా ఉన్నాయి. ప్రభుత్వం గతంలో ఈ భూములను లావణి పట్టా లుగా ఇచ్చారు. మళ్లిd తీసుకునే క్రమంలో రైతులకు ఎంత పరి హారంగా చెల్లించాలనే లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ కారణంతో ప్రాజెక్టు పనుల్లో కొంత ఆలస్యం జరుగు తోందని అధికారులు తెలుపుతున్నారు. ఎకరానికి సుమా రుగా రూ.35 నుంచి రూ.36 లక్షల చొప్పున లబ్దిదారులకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు నష్టపరిహారంగా రూ.20 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించింది.

  • కేశవాపూర్‌ రిజర్వాయర్‌ ప్రత్యేకతలివే..

రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమయ్యే భూమి – 1500 ఎకరాలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం – రూ.4500 కోట్లు రిజర్వాయర్‌ సామర్థ్యం – 5.4 టీఎంపీలు (గోదావరి జలాలు) ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ – 596 మీట ర్లు ఎల్‌డబ్ల్యూఎల్‌ఎల్‌ (లోడ్‌ వాటర్‌ లైన్‌ లెన్త్‌) – 540 మీట ర్లు నీటి వనరు – కొండ పోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ సీడ బ్ల్యూఆర్‌ (క్రాస్‌ వాటర్‌ రిక్వైర్‌మెంట్‌) – 80 మిలియన్‌ లీటర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement