Monday, May 13, 2024

KCR’s Campaign Schedule – 17 రోజులు…41 బ‌హిరంగ స‌భ‌లు…15 నుంచి కెసిఆర్ ఎన్నిక‌ల శంఖ‌రావం

హైద‌రాబాద్ – అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 15న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆ తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. 6న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభల్లో పాల్గొంటారు

సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఇదీ..
అక్టోబర్‌ 15 హుస్నాబాద్‌
అక్టోబర్‌ 16 జనగాం, భువనగిరి
అక్టోబర్‌ 17 సిరిసిల్ల, సిద్దిపేట
అక్టోబర్‌ 18 జడ్చర్ల, మేడ్చల్‌
అక్టోబర్‌ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్‌ 27 పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్
అక్టోబర్‌ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

ఒకే రోజు రెండుచోట్ల నామినేషన్లు
సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement