Thursday, May 9, 2024

ఆర్ ఎఫ్ సి ఎల్ పునరుద్ధరణతో .. రైతులకు ఎరువుల కోరత తీరబోతుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గోదావరిఖని, (ప్రభ న్యూస్): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం వచ్చిన సందర్భంగా ఎన్టిపిసి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది రైతులకు అనుకూలమైన ప్రభుత్వమని పేర్కొన్నారు, తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యమంలో సైతం రామగుండం అడ్డా కరీంనగర్ గడ్డగా పేరుగాంచిందని కరీంనగర్ గడ్డపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండంలో పర్యటించి ఆర్ఎఫ్సెల్ని జాతికి అంకితం చేయడం తెలంగాణ రైతులకు ఒక వరం లాంటిదని కిషన్ రెడ్డి అన్నారు, ఆర్ ఎఫ్ ఎల్ పునరుద్ధరణ ద్వారా తెలంగాణలోని ప్రతి రైతుకి లాభం చేకూరుతుందని 98% యూరియాగా ఉన్న ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు భారత ప్రభుత్వం మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగులతో పాటు ఆర్ఎఫ్సియల్ ద్వారా తెలంగాణలోని ప్రతి రైతుని రాజు చేసే సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రామగుండం లోని ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి శాతాన్ని పెంచింది నాడు ఉన్న విద్యుత్ అదనంగా మరికొన్ని వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసిందని తెలిపారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు, ఎన్టిపిసికి ₹4,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు, అతిపెద్ద సోలార్ ప్లాంట్ సైతం రామగుండంలో ప్రారంభించిన గత మోడీదేనని కిషన్ రెడ్డి అన్నారు, సింగరేణి సైతం ప్రైవేటుపరం కేంద్ర ప్రభుత్వం చేయలేదని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సింగరేణి ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు, ప్రతి గ్రామపంచాయతీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టే గ్రామాల్లో విద్యుత్తు లైట్లు వెలుగుతున్నాయని గ్రామ స్వరాజ్యం వస్తుందని ఆయన తెలిపారు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను సైతం నరేంద్ర మోడీ ఇస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు, కరోనా సమయంలో సైతం 201500 కోట్ల వ్యాక్సిన్ని ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిందని కరోనా సమయంలో నరేంద్ర మోడీ చేసిన సేవలు తెలంగాణ ప్రజలు మరువరని ఆయన అన్నారు,రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధిలో బిజెపి పాత్ర ఎలా ఉంటుందో తెలంగాణలోని ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి చెప్తామని ఆయన తెలిపారు, తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కంకణబద్ధమై పనిచేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement