Sunday, May 5, 2024

యువకుడి ఆత్మహత్య..

పెద్దపల్లి ‌: పట్టణ శివారులో కునారం రైల్వే గేటు వద్ద ఇరుగాల మధుకర్‌ (24) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా తహరి కొండాపూర్‌కు చెందిన మధుకర్‌ హార్వెస్టర్‌ నడుపుతున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడని, పెద్దపల్లి శివారులో ఉరివేసుకొని మృతిచెందినట్లు వివరించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement