Saturday, May 4, 2024

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం

వేములవాడ: ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే వారిని ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వేములవాడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులను మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఐదు రోజుల నుండి పోలీస్‌ స్టేషన్‌కి పిలవడం సంతకాలు పెట్టించుకోవడం, పంపించడం, మళ్లీ అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సంవత్సరం నుండి లేకపోవడంపై ప్రశ్నించడమే తప్పిదమా.. ఎమ్మెల్యే రమేష్‌ బాబు ప్రజలకు అందుబాటులో లేడని తెలపడం కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అసెంబ్లీకి తరలివెళ్లే క్రమంలో అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పిలుపుమేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమైన కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టయిన వారిలో మూడికే చంద్రశేఖర్‌, అరుణ్‌ తేజా చారి, కొనకళ్ల రాజు, కూరగాయల కొమురయ్య, నాగుల రాము గౌడ్‌, వస్తాదు కృష్ణ, రఘు, పరశురాం, ఇటిక్యాల లింగయ్య, శ్రీకాంత్‌, మల్లికార్జున్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement