Monday, May 6, 2024

KNR: బీసీల గురించి మాట్లాడింది రాహుల్ గాంధే.. వీహెచ్

బీసీల గురించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు అన్నారు. బుధవారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ..యావత్ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాస్ట్ సెన్సెక్స్ చేస్తానని చెప్పలేదని రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడారన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వలనే ఈరోజు బీసీ పిల్లలు ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మహిళలకి 33శాతం రిజర్వేషన్ తీసుకువచ్చారని గుర్తు చేశారు.

జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకి అన్యాయం జరుగుతుందన్నారు. నరేంద్ర మోబీ ఓబీసీ ప్రధాని అయినా బీసీలకు న్యాయం జరుగడం లేదన్నారు. బీసీ ఓట్ల గూర్చే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు, కానీ 0.5 శాతం ఉన్నవారే తెలంగాణలో పదవుల్లో ఉన్నారన్నారు. అగ్రకులంలో పుట్టిన గాంధీ కుటుంబం వారు బీద వర్గాల వారి గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement