Tuesday, May 14, 2024

KNR: స్వాతంత్రానికి పూర్వపు పత్రిక.. క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ప్ర‌భ‌న్యూస్‌: భారతదేశానికి స్వాతంత్రానికి స్వాతంత్రం సిద్ధించక ముందు నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. శనివారం వేములవాడలో ఆంధ్రప్రభ రాజన్న సిరిసిల్ల జిల్లా 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం అలవాటని, 1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్, యూట్యూబ్ విభాగాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ వేములవాడ ఇంఛార్జి లాయక్ పాష, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement