Wednesday, May 1, 2024

Road Accident: బేగంపేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం… ప‌ల్టీ కొట్టిన కారు

బేగంపేట ఫ్లైఓవర్‌పైతెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పల్టీకొట్టిన కారును ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement