Sunday, December 8, 2024

Train Derail : ప‌ట్టాలు త‌ప్పిన జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ … ప్ర‌యాణీకుల‌కు త‌ప్పిన ప్ర‌మాదం..

జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటాలో రైలు నంబర్ 14813, జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ యొక్క రెండు కోచ్‌లు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కోటా డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా విడుదల చేశారు. ‘‘కోటా జంక్షన్ సమీపంలో భోపాల్ వెళుతున్న ప్యాసింజర్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి, రెస్క్యూ ఆపరేషన్‌ సాగుతోంది’’ అని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే అధికారులు రైలు మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement