Saturday, April 13, 2024

Plane Crash : హాలీవుడ్‌లో విషాధం.. స‌ముద్రంలో కూలీన విమానం…హాలీవుడ్ న‌టుడు మృతి

హాలీవుడ్‌లో విషాధం చోటుచేసుకుంది. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలివర్, అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మృతి చెందారు. జర్మనీలో జన్మించిన హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ తన ఇద్దరు చిన్న కుమార్తెలతో పాటు వారు ప్రయాణిస్తున్న చిన్న విమానం టేకాఫ్ తర్వాత కరేబియన్ సముద్రంలో కూలిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు.

‘ది గుడ్ జర్మన్’ 2008 యాక్షన్-కామెడీ,స్పీడ్ రేసర్లో జార్జ్ క్లూనీతో కలిసి పెద్ద స్క్రీన్‌పై కనిపించిన ఒలివర్ గురువారం రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీస్ ఫోర్స్ ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన విమాన ప్రమాదంలో మరణించాడు. మత్స్యకారులు, కోస్ట్ గార్డులు వెంటనే కరేబియన్ సముద్రంలోని సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ నాలుగు మృతదేహాలను వెలికితీశారు.

ఈ విమాన ప్రమాదంలో ఒలివర్ (51), అతని కుమార్తెలు మడిత (10), అన్నీక్ (12), పైలట్ రాబర్ట్ సాచ్స్‌తో కలిసి మరణించారు. గ్రెనడైన్స్‌లోని చిన్న ద్వీపం బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తోండగా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఒలివర్ కుటుంబం పర్యటనకు వెళ్లి వస్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. ఒలివర్ 60కిపైగా చిత్రాల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement