Tuesday, May 7, 2024

మంజులకు మణిపూసల పురస్కారం

మెట్‌పల్లి: ఆధునిక తెలుగు సాహిత్యంలో వడిచర్ల సత్యం ప్రవేశ పెట్టిన నూతన కవితా ప్రక్రియ మణిపూసలు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్కొండ సాహితీ కళా సమితి హైదరాబాద్‌ ఆధ్వర్యంలో శతాధిక మణిపూసలు రచించిన మెట్‌ పల్లి వాసి బాస మంజులకు మణిపూసల కవిభూషణ.. పురస్కారాన్ని గోల్కొండ సాహితీ కళా సమితి అంద జేసింది. సమితి వ్యవస్థాపకులు డాక్టర్‌ చంద్రప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన జూమ్‌ ద్వారా ఏర్పాటు- చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ కవి గంటా మనోహర్‌ రెడ్డి పురస్కారం అందచేశారు. ఉపాధ్యాయవృత్తి నిర్వర్తిస్తునే బాస మంజుల తన అభిరుచి మేరకు కథలు, విమర్శనా వ్యాసాలు, ప్రాసలు, పలు ప్రక్రియల్లో కవితలు రాస్తూ ఎన్నో సంస్థల నుండి ప్రశంసా పత్రాలందుకున్నారు. మణిపూసల పురస్కారం పొందిన బాస మంజులను పలువురు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, అభినందించారు. ఈకార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత యన్‌. జనార్ధన్‌, మణిపూసల రామాయణ కర్త టి. ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, గోల్కొండ సాహితీ కళా సమితి ప్రధాన కార్యదర్శి జె. రామకృష్ణ రాజు, అడ్డగూడీ ఉమాదేవి ఘనపురం పరమేశ్వర్‌, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement