Monday, April 29, 2024

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు

ప్లాస్టిక్‌ వాడకంతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరుతూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మమత మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లను వినియోగించడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా బట్ట సంచులను వాడడం ద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతామన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా గమనించి ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement