Friday, April 26, 2024

స్వరాష్ట్రంలోనూ ఆత్మహత్యలా..?

మెట్‌పల్లి: నిధులు, నియామకాలు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలోనూ యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో తీవ్రంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికేల నవీన్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం సుమారు 1500 మంది ఆత్మబలిదానాలు చేశారని, ఉద్యమాతో సాధించుకున్న తెలంగాణలో నేటికి ఆత్మహత్యలు చేసుకోవడం తెరాస ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లవి ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై లేదన్నారు. బంగారు, ధనిక తెలంగాణ గా చెప్పుకునే సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ యువతను, ప్రైవేటు- టీ-చర్లను, లెక్చరర్‌లను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో బొడ్ల నరేష్‌, రమేష్‌ యాదవ్‌, కోయల్కర్‌ రాజ్‌ కిరణ్‌, కలికోట శ్రీకాంత్‌, అరిగెల అజయ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement