Tuesday, April 13, 2021

సింగరేణి కార్మికుల సమస్యలు..

రామగిరి: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్జీ3 ఏరియా పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ2, ఏఎల్‌పీ, సీహెచ్‌పీలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి జూపాక రాంచందర్‌ ఆధ్వర్యంలో గనుల మేనేజర్లకు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి కార్మికులకు కూడా 61 ఏళ్ల వరకు రిటైర్మెంట్‌ అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఇతర 14 డిమండ్లతో కూడిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిట్‌ కార్యదర్శులు డిటి రావు, జగదీష్‌, రవికుమార్‌, నాయకులు మర్రి రాజు, వెంకటేశ్వర్లు, ఎన్‌ వి రాజు, పోలు కనకయ్య, రామ్‌ చందర్‌, ఎం శ్రీనివాస్‌, రామ్మూర్తి, సదానందం, అమృతరావు, మల్లేష్‌, గంగాధర్‌, రత్నం, కే రాజయ్య, ప్రభాకర్‌, వెంకన్నలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News