Wednesday, May 15, 2024

ఆర్ ఎఫ్‌సీఎల్‌ బాధితులకు అండగా ఉంటాన‌న్న‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మెాసపోయున బాదితులెవ్వరు అధైర్యపడవద్దని అందరికి అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గురువారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అఖిలపక్ష కమిటి బాధ్యులు కాసిపెట లింగయ్య, గుమ్మడి కుమారస్వామి, యాకయ్య రాజన్న, గంటా నారాయణ ఆర్.ఎఫ్.సి.ఎల్ అధికారులు చౌదరి కాంట్రాక్టు కంపని వారితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో ఎర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం లోని ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట దళారులు డబ్బులు తీసుకున్నరనే అభియెాగం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆర్ఎఫ్ఎల్ బాదితుల కొసం ప్రత్యేకంగా వారి సమస్యలు పరిష్కారం కోసం వేదిక ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.

కొంత మంది రాజకీయ కుట్రల మూలంగా రెచ్చగొట్టే మాటలతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన హరిష్ కుటుంబాన్ని అఖిల పక్ష కమిటి సభ్యులందరం కలసి పరమర్శించడఁ జరిగిందని వారి కుటుంబంతో మాట్లాడి వారికి భరోసా కల్పించామన్నారు. హరిష్ కుటుంబానికి సదరు కాంటాక్ట్ కంపనిలైనా స్టార్ చౌదరి వారి ద్వారా 15 లక్షలు, హరిష్ నుండి డబ్బులు తీసుకున్న దళారుల నుండి 14 లక్షలుతో పాటు ఆర్.ఎఫ్.సి.ఎల్ కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగం బాధిత కుటుంబానికి అందించేలా అఖిల పక్ష కమిటి కృషి చేయడం జరిగిందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ లో ఉద్యోగాలు పేరిట మెాసం చేసిన దళారులంతా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సిందేనన్నారు. బాదితులేవ్వరు తోందరపాటు చర్యలకు పాల్పడవద్ధని వారందరకి నాయ్యం చెస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement