Saturday, April 27, 2024

తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యత : మంత్రి కేటీఆర్‌

ఆనాడు తెలంగాణలో సబండవర్ణం ఏకమై చేసిన పోరాటాన్ని వక్రీకరిస్తూ త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు లేపడానికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వసుదైక కుటుంబం అనే భావన నెలకొల్పుతూ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొడదామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలన్నీ భారత్ లో ఐక్యమయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన వీరులను యోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. జాతీయ సమైక్యత అంటే కేవలం భౌగోళికమే కాదు ప్రజల మధ్య సమైక్యత సంస్కృతుల మధ్య సమైక్యత అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడమే నిజమైన సమైక్యత అన్నారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని కలగలిపి దేశంలోనే అగ్రరాష్ట్రంగ రూపుదిద్దుకొందన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశంలో ఏ నాయకునికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి మానస పుత్రిక అన్నారు. రాజరాజేశ్వర జలాశయంతో జిల్లాలోని భూగర్భ జలాలను పెంచడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా అందులో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్ రూమ్ పథకం లేదన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు 3 లక్షల రూపాయలతో ఇల్లు నేర్పించుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి దళిత బంధు పథకాన్ని తెలంగాణలోనే ప్రవేశపెట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలన దేశంలోనే ఓ ట్రేడ్ మార్క్ గా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement