Saturday, October 12, 2024

KNR: కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు.. సీపీ రెమా రాజేశ్వరి

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం రామగుండం కమిషనరేట్ పరిధిలో మందమర్రి, రామగుండం, పెద్దపల్లి లలో మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్, సిఐలు అనిల్, సత్యనారాయణ, ఎస్ఐ మహేందర్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, రాంరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement