Wednesday, May 15, 2024

ఎల్లమ్మ కళ్యాణమహోత్సవం..

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో ఏప్రిల్‌ 27న నిర్వహించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావాలని గౌడ సంఘం ప్రతినిధులు సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డిని ఆహ్వానించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవ సందర్భంగా స్థానిక గౌడ సంఘం అద్యక్షులు గంట నారాయణ గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు- చేస్తున్నారు. ఏప్రిల్‌ 6న ఎల్లమ్మ గడను ఏర్పాటు- చేస్తున్నామని తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు సంఘం ఆధ్వర్యంలో ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎల్లమ్మ గుడి వద్ద సరిపడు స్థలం లేనందున ఏర్పాట్లకు రాగుల నడిపి రాజిరెడ్డి పొలం కోసం నిర్ణయించారు. ఈకార్యక్రమంలో నాగుల ఎల్లాగౌడ్‌, చింతకింది దేవాగౌడ్‌, తిరుపతి గౌడ్‌, గంట రవిగౌడ్‌, అంజాగౌడ్‌, నల్లమందు దేవయ్య గౌడ్‌, గంట రమేశ్‌ గౌడ్‌, వార్డు సభ్యులు గంట బాల కిషన్‌ గౌడ్‌, పందిర్ల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement