Thursday, May 2, 2024

బ్రిడ్జి పనులు..

ముత్తారం: మండలంలోని ఓడేడ్‌ మానేరుపై బ్రిడ్జి నిర్మాణం కోసం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంథని ఆర్డీవో కృష్ణవేణి పేర్కొన్నారు. ఓడేడ్‌ గ్రామంలో పర్యటించిన ఆర్డీవో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బ్రిడ్జి వరకు సేకరిస్తున్న భూమిలో కోల్పోయే స్థలాలపై ఆరా తీశారు. ఈసందర్భంగా బ్రిడ్జి పనులు నిలిపివేయడంపై ఏఈని ప్రశ్నించగా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నిలిపివేసినట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గ్రామపంచాయతీ భవనం కూడా కొంత వరకు రోడ్డులో కోల్పోయే అవకాశం ఉండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. జీపీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. అలాగే పశువైద్యశాల కూడా పూర్తిగా రోడ్డు నిర్మాణంలో కోల్పోతుండడంతో మరో చోట స్థలం కేటాయించి నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, ఆర్‌అండ్‌బీ డీఈ జాఫర్‌, సర్పంచ్‌ సిరికొండ బక్కారావు, ఎంపీటీసీ పోతుపెద్ది కిషన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్‌, ఆర్‌ఐ చంద్రశేఖర్‌, సర్వేయర్‌ లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement