Thursday, May 9, 2024

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

పెద్దపల్లి రూరల్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవ వేడుకలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత కల్వకుంట్ల కవితకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించడంతో పాటు- బతుకమ్మ విశిష్టతను తెలియజేశారన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమత ప్రశాంత్‌ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు పసుల చరణ్‌, జిల్లా అధ్యక్షుడు సంగ్రామ్‌ సింగ్‌, గర్రేపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ సందీప్‌ రావ్‌, భూమేష్‌, ఉప్పు రాజ్‌ కుమార్‌ అనిల్‌, అన్వేష్‌, సాయి తో పాటు- పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement