Tuesday, October 8, 2024

మూడవసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను ఆశీర్వదించండి – ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి

కౌడిపల్లి సెప్టెంబర్ 23 ప్రభ న్యూస్ మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీ ఆర్ ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి తెలిపారు శనివారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు పాక్షికంగా ఇల్లు కూలిపోయిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ మూడవసారి కూడా ముఖ్యమంత్రిగ కెసిఆర్ ని ఆశీర్వదించాలని తెలిపారు పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కెసిఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు నాడు 200 ఉన్న పెన్షన్ నేడు 2000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు వికలాంగులకు 4000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు కల్యాణ లక్ష్మి 51000తో ప్రారంభమైతే నేడు లక్ష 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 13 ఇల్లు కోల్పోయిన వారికి 87 చెక్కులు అదేవిధంగా 59 జీవో నంబర్ ఆధారంగా నలుగురికి ఇల్లు పట్టా కాయితాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్ వైస్ ఎంపీపీ నవీన్ జడ్పిటిసి కవిత అమర్ సింగ్ ఎంపీడీవో శ్రీనివాస్ ఎమ్మార్వో అంజయ్య మండల తెరాస అధ్యక్షుడు సారా రామ గౌడ్ ఆర్ఐ శ్రీహరి మండల కో ఆప్షన్ సభ్యులు హైమద్ నాయకులు కృష్ణ గౌడ్ మండల పరిధి గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement