Wednesday, May 8, 2024

కల్లెడ సర్పంచ్ లావణ్య ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ పెద్దగాని లావణ్య మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పదవినుంచి సస్పెండ్ కావడం.అప్పులిచ్చిన వారి వేధింపులు అధికమవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల నుంచి తెలిసిన సమాచారం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె భ‌ర్త స్థానిక ఎమ్మెల్యే హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడిగా ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement