Saturday, April 27, 2024

ఆదిలాబాద్ జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

ఆదిలాబాద్ జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మువ్వన్నెల జెండా మురిసి పోతూ ఎగిరింది. ముఖ్య అతిథిగా హాజరైన సుంకరి రాజు గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం మహాత్ములు చేసిన త్యాగాల గురించి, జిల్లాలో జరిగిన సంక్షేమం గురించి శాఖల వారిగా తెలిపారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉన్న దేశభక్తిని వారి అట, పాటలతో, నృత్యాలతో ప్రదర్శించి చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధిలు, అధికారులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హాజీపూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

హాజీపూర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా
నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ స్వర్ణలత – శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జ్ తహశీల్దార్ హరిత, 13వ బెటాలియన్ లో కమాండెంట్ సయ్యద్ జమీల్ పాష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లహరి, పశు వైద్యశాలలో డాక్టర్ శాంతి రేఖ, సరితలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వర్ణలత మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన అమరవీరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు. అంతే కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లో పాఠశాలల్లో, కళాశాలలో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రతీ ఒక్కరూ తమ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేశారు.

- Advertisement -

ఉత్తమ విద్యార్థికి నగదు పురస్కారం…

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ అత్యధిక మార్కులు సంపాదించిన తడకల శశాంతు అనే విద్యార్థికి కీర్తిశేషులు పులి ప్రభాకర్ రావు స్మారకార్థం వారి కుమారుడు పులి కిషోర్ ఆర్థిక సహాయంతో రూ.10,116ల నగదు పురస్కారాన్ని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు గురు కృప స్పోర్ట్స్ ప్రధాన కార్యదర్శి కారంగుల రామయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు ఈ పురస్కారాన్ని అందజేయడం చాలా ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement