Sunday, April 28, 2024

డేంజర్ జోన్ లో కడం ప్రాజెక్ట్ – 14 వరద గేట్ లు ఎత్తివేత

కడెం. జులై 27 ప్రభ న్యూస్ నిర్మల్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ మళ్లీ డేంజర్ జోన్ లో పడింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడెం జలాశయంలో దాదాపు 3 లక్షల 80 వేలు క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు కెపాసిటీ మూడు లక్షల 50 వేల క్యూసెక్కులు కాగా ఎగువ ప్రాంతం నుండి 3, లక్షల ,80 వేలు క్యూసెక్కులు వరద ప్రవాహం వస్తుంది

కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 వరద గేట్లు ఉండగా అందులో నుండి 14 వరద గేట్లు ఎత్తివేసి 2 లక్షల 40వేలు క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలారు మరో నాలుగు వరద గేట్లు మొరాయించాయి ప్రస్తుతము వరద నీరు ప్రాజెక్టు పైకి చేరుకుంటుంది దిగువ ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 ప్రస్తుతం 699.800 అడుగులకు ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement