Tuesday, March 19, 2024

తెలంగాణ‌లో మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు

మ‌రో మూడు రోజులు తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.టోలి చౌక్ లో 9.1సెం.మీ, రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో 6.3సెం.మీ, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 6.1సెం.మీ, కుత్బుల్లాపూర్ జీడిమెట్ల గాయిత్రినగర్‌లో 5.3సెం.మీ. కాజాగూడలో 5.3సెం.మీ, శంకర్‌పల్లి పొద్దుటూరులో 5.2సెం.మీ. జూ పార్క్ 5.1సెం.మీ పడింది.

నేడు కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. దీంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది.కాగా నిన్నటి నుంచి తెలంగాణలో వ్యర్ధాలు పడుతునాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement