Monday, May 13, 2024

IT RAIDES : పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు…

మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఉదయం 4 గంటల నుంచి ఐటీ రైడ్స్ ఏకకాలంలో జరుగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆయనకు సంబంధించిన బంధువులు, కార్యాలయాల్లో ఏక కాలంలో ఆదాయపు పన్ను అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ పొంగులేటికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement