Tuesday, November 28, 2023

ADB : జిన్నింగ్ మిల్ లో ఐటీ సోదాలు

తాండూర్, నవంబర్ 21 (ప్రభ న్యూస్) తాండూర్ మండల కేంద్రంలోని రేపల్లెవాడ సమీపంలోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లు లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్కమ్ టాక్స్ అధికారులు సిఐఎస్ఎఫ్ భద్రత దళాలతో కలిసి జిన్నింగ్ మిల్లు లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించారు.

- Advertisement -
   

మిల్లులోనికి ఎవరిని వెళ్లకుండా చేసి రికార్డులను ,లావాదేవీలను పరిశీలించారు. దాదాపు 6 ,7 గంటల పాటు సుదీర్ఘంగా ఈ తనిఖీలు జరగడం మండలంలో కలకలం రేపింది. ఐటి అధికారుల సోదాల గురించి తెలిసి బెల్లంపల్లి ఏసిపి సదయ్య ,తాండూర్ సిఐ శ్రీనివాసరావు, మాదారం తాండూర్ ఎస్సైలు అశోక్, రాజశేఖర్లు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement