Tuesday, July 23, 2024

TS | అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ గెల‌వాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు సీఎం రేవంత్ రెడ్డి పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మొదట మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రియాంక గాంధీతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు.

నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరులో నిర్వహించిన కార్నర్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీది విభ‌జించు, పాలించు సిద్దాంతం అని, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు రాజేసి రాజకీయాలు చేసి, బీజేపీ సీట్లు నెగ్గే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పటాన్ చెరు మినీ ఇండియా లాంటిదని, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారని చెప్పారు. పటాన్ చెరు ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారని, రాజ్యాంగాన్ని సైతం మార్చే యోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోగా, ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మాత్రం చేశారని విమర్శించారు.

కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా వెనుకబడింది..

వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డిని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని, కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నిసార్లు అడిగినా పాలమూరు ప్జాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాతీయ హోదా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు వ‌స్తాయ‌ని అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement