Friday, July 26, 2024

KKR vs MI | టాస్ గెలిచిన ముంబై…. మ్యాచ్ 16 ఓవ‌ర్ల‌కు కుదింపు

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెటిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని.. కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక, కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 7:30 ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 9 గంటలకు ప్రారంభమైంది. అయితే, టాస్ డిలే కావడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు, పవర్ ప్లే ను 1–5 ఓవర్లకు కుందించారు ఎంపైర్లు.

జట్ల వివరాలు :

ముంబై ఇండియన్స్ :

ఇషాన్ కిషన్ (wk), నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, నువాన్ తుషార, జస్ప్రీత్ బుమ్రా.

కోల్‌కతా నైట్ రైడర్స్ :

ఫిలిప్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయ‌ర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్, అనుకుల్ రాయ్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, అంగ్క్రిష్ రఘువంశీ

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, షమ్స్ ములానీ, కుమార్ కార్తికేయ, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ

సమరోత్సాహంతో కోల్‌కతా…

వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. అయితే, ఈ సీజ‌న్‌లో ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై జట్టు ఓదార్పు విజయం కోసం, మరోవైపు కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా కైవసం చేసుకోవడం కోసం పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement