Tuesday, May 28, 2024

Pitapuram – కుక్కుటేశ్వర స్వామి ఆల‌యంలో సురేఖ‌, చెర్రీ పూజ‌లు…

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్‌ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు రామ్ చరణ్ , సురేఖ. జనసేన అధిపతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.


అనంతరం బయటకు వచ్చి జనసేన అభిమానులు, కార్యకర్తలకు కలిసి అభివాదం చేశారు పవన్, రామ్ చరణ్. బాబాయ్, అబ్బాయ్ లను ఒకే ఫ్రేమ్‌లో చూడడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. . జనసేన అభిమానులు కేకలు, అరుపులతో హోరెత్తించారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కోరారు. చిరంజీవి వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్ ‘మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement