Saturday, April 27, 2024

నూతన మండలంగా ఇనుగుర్తి.. వ‌ద్దిరాజు విజ్ఞ‌ప్తితో ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇనుగుర్తిని మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయడానికి ఉన్నఅర్హతలు.. చారిత్రక నేపథ్యాన్ని.. ఆ గ్రామానికి చెందిన రాజ్యసభ స‌భ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ ను కలిసి వివ‌రించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యేలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని దీనిపై చర్చించారు.

అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ముఖ్యమంత్రి ఇనుగుర్తిని మండలంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement