Monday, May 29, 2023

పెర‌గ‌నున్న ఇంజనీరింగ్‌ ఫీజులు.. వారం రోజుల్లో నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా, పలు వృత్తి విద్యా కోర్సుల ట్యూషన్‌ ఫీజులు త్వరలోనే పెరగనున్నాయి. పెంచే ఫీజులు 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌ కాలేజీల్లో కొనసాగుతున్న ఫీజులను స్వల్పంగా పెంచనున్నారు. ఫీజుల పెంపుకు సంబంధించిన నోటిపికేషన్‌ మరో వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజుల పెంపుపై మంగళవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించింది. ఫీజు ఎంత పెంచాలనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఒకవేళ పెంచితో 20 నుంచి 30 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కమిటీ నిర్ణయించినట్లుగా తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement