Thursday, May 2, 2024

మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా.. ట్రాఫిక్ సీఐ అనిల్

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని ట్రాఫిక్ సిఐ అనిల్ పేర్కొన్నారు. ఈరోజు పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించి.. మాస్కులు లేని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే కరోనా బారిన పడాల్సి వస్తుందన్నారు. ఇక నుండి తరచూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్ తోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తుందని… ప్రజలందరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement