Tuesday, April 30, 2024

తెలంగాణ‌లో 144బ‌స్తీ ద‌వాఖానాలు .. 11ల‌క్ష‌ల మందికి ఉచిత ప‌రీక్ష‌లు ..మంత్రి హ‌రీష్ రావు ..

హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైన బ‌స్తీ ద‌వాఖానాల‌ను మోడ‌ల్ గా తీసుకుని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింద‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు. కాగా తెలంగాణ‌లో 144బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బ‌స్తీ ద‌వాఖానాలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నార‌ని చెప్పారు. 11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేసామని.. రిపోర్ట్స్ నేరుగా మొబైల్ కి వస్తున్నాయన్నారు. 4 సూపర్ స్పెషలాటి ఆసుపత్రిని నిర్మించబోతున్నామన్నారు.. త్వరలో ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్టాపన చేయనున్నారని.. ఓమిక్రాన్ అని కొత్త వైరస్ వచ్చింది అని ప్రజలు భయపడుతున్నారని అన్నారు.

ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొవడం కోసం ప్ర‌భుత్వం అన్ని చర్యలు తీసుకుందని.. కరోనాని ఎదుర్కోవడం ప్రజలు చేతులు ఉందన్నారు.ఈ మేర‌కు అంద‌రూ వాక్సిన్ వేసుకోవాలి,మాస్క్ పెట్టుకోవాలి,ఫీజీకల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. 2 కోట్ల 51 లక్ష మొదటి టీకా వేసుకున్నారని.. 2 టీకాలు వేసుకోండి, ప్రాణాపాయం ఉండదని తెలిపారు. 80 లక్షలు వాక్సిన్ స్టాక్ ఉందన్నారు. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల అప్పుడు ఎలా ఓటు కోసం వెళ్లారు, ఒక్కక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలని సూచించారు. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement