Tuesday, May 21, 2024

MDK : కాంగ్రెస్‌లోకి కేసీఆర్ ద‌త్తత గ్రామ మాజీ సర్పంచ్

మాజీ కేసీఆర్ ద‌త్త‌త గ్రామం ఎర్ర‌వ‌ల్లిలో బీఆర్ఎస్‌కు ఊహించ‌ని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్‌ తాజామాజీ భాగ్య‌ల‌క్ష్మీ చేరారు. లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ‌ర్కూర్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ చేరినట్లు భాగ్యలక్ష్మి తెలిపారు. కాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ ఉన్న గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ లో చేరడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, తూంకుంట నరసింహారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఎలక్షన్ కోఆర్డినేటర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement