Thursday, September 21, 2023

ఈజీ మ‌నీ కోసం రాంగ్ రూట్‌.. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

నాగోల్, (ప్రభ న్యూస్) : రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ జోన్ SOT, వనస్థలిపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వనస్థలిపురం సుష్మ ఎక్స్ రోడ్డు వద్ద నిషేధిత పదార్థాలతో చైనా రామ్, రాణా రామ్ నుంచి సుమారు 25లక్షల విలువైన 7 కేజీల పోపీస్ట్రా డ్రగ్స్, 70 గ్రాముల ఓపియంను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వీరు రాజస్థాన్ నుంచి హెరాయిన్‌ తయారీకి కావల్సిన ముడిసరకు అయిన గసగసాలు, నల్లమందు, గసగసాల గడ్డిని తీసుకొస్తున్నార‌ని, వీటిని వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు ఇరువురు పెంయిటర్లు గా పనిచేస్తూ ఉండేవారని అధిక సంపాదన కొరకు అడ్డదారిన డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement