Sunday, May 12, 2024

వ‌న‌మా పిటిష‌న్ పై హైకోర్టులో వాద‌న‌లు పూర్తి .. తీర్పు రిజ‌ర్వ్

హైద‌రాబాద్ కొత్త‌గూడెం – తనపై వేసిన అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అప్పీల్ కు వెళ్లాడానికి అవకాశం ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ) హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. వనమా పిటీషన్ ను హైకొర్టు విచారణకు స్వీకరించిన కోర్టు నేటి మ‌ద్యాహ్నం పిటిష‌న్ త‌రుపు వాద‌నల‌నువిన్న‌ది.

కాగా, వ‌న‌మా ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేయ‌డానికి అవకాశం ఇవ్వాలని, మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు వాయుదా వేయాలని ఎమ్మెల్యే వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు తరుపు న్యాయవాది కోర్టు కు విన్న‌వించారు.. వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది.. తుది తీర్పు రేపు వెలువ‌రించే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement