Friday, May 17, 2024

Baby@72 crores – చిన్న మూవీకి ప్రేక్ష‌కులు క‌న‌క‌వ‌ర్షం …

ఈ నెల 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టిన ‘బేబి సినిమా మొదటి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సాగిన ఈ సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో మొదటి రోజు నుంచి వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. మొదటి వారాంతానికి ఈ సినిమా 50 కోట్ల వరకూ రాబడుతుందని అనుకుంటే, రెండు రోజుల ముందుగానే ఆ మార్క్ ను టచ్ చేసింది.

ఈ సినిమా విడుదలై నిన్నటితో 12 రోజులు అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా 70 కోట్ల మార్కును దాటేసింది. 71.6 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కాగా, బేబి’ 100 కోట్ల మార్కును టచ్ చేస్తుంద‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement