Wednesday, May 15, 2024

రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త జయశంకర్.. మేయర్ విజయలక్ష్మీ

తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయ‌న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్ చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement