Wednesday, May 8, 2024

HYD: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ విజయవంతం

హైదరాబాద్: ఎడమ భుజంలో నిరంతర నొప్పి, వాపుతో బాధపడుతున్న 62ఏళ్ల మహిళకి ట్రాన్స్‌ఫార్మేటివ్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ విధానంతో విజయవంతంగా వైద్య‌ చికిత్సను హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించింది. భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తోన్న ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్యతో రోగి ఎడమ భుజం లో నొప్పితో బాధపడుతున్నారని ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ వాసుదేవ జువ్వాడి నిర్ధారించారు. ఆయ‌న మాట్లాడుతూ… ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బలహీనపరిచే పరిస్థితి, ఇది నడక, రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. ఈ కేసులో రోగి నిరంతర నొప్పి, భుజం కీలు క్షీణతను సూచిస్తుందన్నారు. ఆమె బాధను తగ్గించడానికి సమగ్ర చికిత్సా విధానం అవసరమైందన్నారు. సంక్లిష్టమైన భుజం పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడానికి అవసరమైన నిర్దిష్ట రూపకల్పన, కార్యాచరణ కోసం తాము రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీని ఎంచుకున్నామన్నారు.

అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వై హరి కృష్ణ, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ సీఓఓ, డాక్టర్ ప్రభాకర్ పి, లు మాట్లాడుతూ…. భుజం బ్లేడ్‌కు కృత్రిమ బంతిని జత చేస్తారు. ఆర్మ్ బోన్ పైభాగానికి కృత్రిమ సాకెట్ జతచేయబడి ఉంటుందన్నారు. భుజాన్ని కప్పి ఉంచే పెద్ద డెల్టాయిడ్ కండరం సాధారణంగా చేతిని కదిలించగలదన్నారు. 100 కంటే ఎక్కువ రకాల లక్షణాలు ఆర్థరైటిస్‌లను వివరించడానికి ఉపయోగిస్తారన్నారు. అత్యంత సాధారణ రకాల్లో ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్. భారతదేశంలో, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రెండవ అత్యంత సాధారణ రుమటాలాజిక్ సమస్య అన్నారు. రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ వంటి క్లిష్టమైన ఆర్థోపెడిక్ విధానాలను నిర్వహించడంలో త‌మ హాస్పిటల్ కు వున్న నైపుణ్యానికి తాము గర్విస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement