Wednesday, November 29, 2023

రూ.1.56 లక్షల కోట్లకు చేరిన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎస్‌ఐపీ కలెక్షన్‌

2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ల (ఎస్‌ఐపీ) లో వచ్చే ఫ్లోలలో గణనీయమైన పెరుగుదలను కనబరిచినట్లు బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నివేదించింది. ఇటీవలి నివేదికల ప్రకారం ఎస్‌ఐపీ కలెక్షన్లు 25శాతం పెరిగి రూ.1.56 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఈసందర్భంగా బంధన్‌ ఏఎంసీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ గౌరబ్‌ పారిజా మాట్లాడుతూ… ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎస్‌ఐపీ ఉత్తమ మార్గాల్లో ఒకటని బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (పూర్వపు ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌) నమ్ముతుందన్నారు. ఇది పెట్టుబడిదారులను నిర్దిష్ట కాల వ్యవధిలో క్రమం తప్పకుండా డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందన్నారు.

- Advertisement -
   

పెట్టుబడిదారులకు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం, వారి ఆర్థిక లక్ష్యాలు, రిస్క్‌ ఎపిటీట్‌ ఆధారంగా సరైన ఫండ్‌లను ఎంచుకోవడం గురించి అవగాహన కల్పించడానికి తాము వివిధ అవగాహన ప్రచారాలు, ఆన్‌లైన్‌ సెమినార్లు, ఇంటరాక్టివ్‌ సెషన్‌లను నిర్వహించామన్నారు. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన పెరిగిందన్నారు. ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఎస్‌ఐపీల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది వారి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి గొప్ప మార్గమని గ్రహించారన్నారు. తమ పెట్టుబడిదారులకు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా వారి ఆర్థిక ఆకాంక్షలను సాధించడంలో సహాయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని పారిజా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement