Sunday, May 19, 2024

సాగ‌ర్ చ‌ట్టూ కొత్త బ‌ల‌గం….

గులాబీ దళపతి కేసీఆర్‌ నయా వ్యూహం
యువరక్తానికే.. ఇన్‌ఛార్జి పదవుల్లో ప్రాధాన్యం
ముందుగానే రంగంలోకి… ప్రచారంలో కొత్త పంథా

రాష్ట్ర వ్యాప్త ప్రభావం చూపే మంత్రులు, నేతలకు బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ ఉండగా, ఈసారి అందుకు భిన్నంగా పార్టీకి ఉరిమే ఉత్సాహం ప్రదర్శించే కొత్త నాయకత్వం తయారుచేసి జవసత్వాలు నింపాలని యువ ఇన్‌ఛార్జిలను పంపారు. అందుకు తగ్గట్లే సీనియర్‌ నేతలకు భిన్నంగా.. యువ ఎమ్మెల్యేలు, నేతలు.. క్షేత్రస్థాయిలో మకాం వేసి కొత్త బాధ్యతల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరితో నేరుగా మాట్లాడి దిశానిర్దేశం చేస్తుండడంతో ఉత్సాహంగా.. పరుగు పెడుతున్నారు…

హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌లో.. నయా వ్యూహాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదును పెట్టారు. ఇప్పటికే ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కాగా, మంత్రులు.. పార్టీకి సంబంధించి ఎపుడూ బాధ్యతలు చూసే పెద్దనేతలు కాకుండా.. ఈసారి యువరక్తానికి ఇన్‌ఛార్జి బాధ్య తలు అప్పగించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా నేతల సామర్థ్యానికి పరీక్ష పెట్టారు. మొత్తం 2.17లక్షల ఓటర్లుండే నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీలు ఉండగా, మంత్రులకు కాకుండా.. యువ ఎమ్మెల్యేలకు బాధ్య తలు అప్పగించారు. పెద్దవూర మండలానికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ను ఇన్‌ఛార్జిగా నియమించగా, మాడ్గులపల్లి మండలానికి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని, హాలియా టౌన్‌కు రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌ను ఇన్‌ఛార్జిలుగా నియమించగా, నంది కొండ మునిసిపాలిటీకి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు, అనుముల మండలానికి సీనియర్‌ నేత కోనేరు కోనప్పలకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌ నాయక్‌లు కూడా నియోజకవర్గంలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు.
ముందుగానే రంగంలోకి దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ ఒత్తిడిలో ఉండగా, నాగార్జునసాగర్‌ గెలుపు ద్వారా దీనికి చెక్‌ పెట్టేందుకు, సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకునేందుకు గులాబీదళపతి కేసీఆర్‌ ముందునుండీ వ్యూహరచన చేస్తున్నారు. అస్త్ర శస్త్రాలు, ప్రచార వ్యూహాలు, ఎన్నికల నినాదాలు.. అన్నీ సిద్ధం చేశారు. నాగార్జున సాగర్‌పై దృష్టి అటు అభివృద్ధి వ్యూహాన్ని, ఇటు రాజకీయ సమీకర ణాలను మార్చే ప్రణాళికను అమలు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో మకాం వేసిన పలువురు ఎమ్మెల్యేలు.. అటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూనే, సాగర.. సమీకరణాలను గులాబీకి అనుకూలంగా మార్చే పనిలో పనిచేశారు. ఎమ్మెల్సీ పోలింగ్‌ ముగియగానే.. షెడ్యూల్‌ కూడా రావడంతో.. పూర్తి స్థాయి ప్రచారబ రిలోకి దిగారు. సాగర్‌ నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీలు ఉండగా, 2.17 లక్షల మంది ఓటర్లున్నారు. గిరిజన (లండాడ), యాదవ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, నామినేషన్ల స్వీకరణ 30 వరకు జరగనుంది. ఏప్రిల్‌ 3న ఉపసంహరణ, 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 1న నోముల హఠాన్మరణం మొదలు గల్లి నుంచి ఢిల్లి వరకు నాగార్జున సాగర్‌లో ఏం జరుగుతుందో, జనాభిప్రాయం ఎలా ఉంటుందోనన్న అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నిక ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తుండటం, జానాపైనే రాష్ట్ర కాంగ్రెస్‌ భవిష్యత్తు ఆధారపడి ఉండడం, ఇక్కడా గెలుపొంది వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంవైపు దూసుకువెళ్లాలని బీజేపీ.. ఎవరికి వారు ఎత్తుగడలు వేస్తుండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అభ్యర్థిత్వాలకు సంబంధించి కూడా టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి.
ప్రచారంలో కొత్తపంథా
సీఎం నియమించిన కొత్త బలగం.. నాగార్జునసాగర్‌లో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండడంతో ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన చిన్న చిన్న సమస్యలను ఠక్కున పరిష్కరిస్తుండగా, ఆయా గ్రామాల్లో స్థాని కంగా ఇమేజ్‌ పెరుగుతోంది. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ వల్లే భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందన్న చర్చ జరుగుతోంది. రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ హాలియాలో భరోసా అనే కార్యక్రమం చేపట్టి.. రోజుకో మునిసిపల్‌ వార్డులో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుం టున్నారు. వినూత్న రీతిలో స్థానికుల కోసం ఫిర్యాదుల బాక్సులు కూడా ఏర్పాటు చేయించారు. ఇక ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. తెల్లవారుజాము నుండే గ్రామాల్లో పర్యటిస్తూ.. అన్నివర్గాలను పలకరిస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకుంటూ అధిష్టానానికి నివేదిస్తున్నారు. ఎప్పటికపుడు క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. నమస్తే.. అభగంపురం అని, నమస్తే పేరుతో.. గ్రామాల్లో పర్యటిసు ్తన్నారు. ఇక పెద్దవూరలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ స్థానికంగానే మకాం వేసి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ, పెండింగ్‌ పనులపై అధికారులకు ఆదేశాలిస్తూ.. ప్రతిరోజూ గ్రామాల వారీగా యువ తతో, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కీలకంగా పనిచేస్తు న్నారు. నందికొండలో సునీల్‌ రావు, అనుములలో కోనేరు కోనప్ప తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఇలా కొత్త బలంగా.. తమ ప్రచారం, ఆకట్టుకోవడంలోనూ నవ్యత ప్రదర్శిస్తుండగా.. సూక్ష్మ స్థాయి సమస్యలను కూడా గుర్తించి అధిష్టానానికి నివేదిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు నివేదిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌లో చేస్తున్న యువరాజకీయం, మోహరించిన కొత్త బలగం తమదైన శైలిలో దూసుకుపోతోంది. మంత్రులను కాకుండా.. కొత్త ఎమ్మెల్యే లకు బాధ్యతలు అప్పగించడంపైనే ఆసక్తికర చర్చ సాగుతుండగా, అభ్యర్థి ఎంపికలోనూ సంచలనం ఉండే అవకాశం కనబడుతోంది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పనిచేస్తుండడం, నేరుగా ఆయా నేతలకు సీఎం మార్గనిర్దేశనం చేస్తుండడంతో ఇన్‌ఛార్జిగా వెళ్ళిన నేతలు కూడా ఉత్సాహపడుతున్నారు. మొత్తంగా సాగర్‌లో గులాబీదళపతి విలక్షణ రాజకీయం ప్రత్యర్థులకు అంతుచిక్కడం లేదు. ఎన్నికల నాటికి మరే వ్యూహాలు.. అమలుచేస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement